ఎస్‌వీఎస్‌లో రాష్ట్రస్థాయి వైద్యసదస్సు | - | Sakshi
Sakshi News home page

ఎస్‌వీఎస్‌లో రాష్ట్రస్థాయి వైద్యసదస్సు

Nov 13 2026 4:05 AM | Updated on Nov 13 2026 4:05 AM

పాలమూరు: వైద్య విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ప్రత్యేక్ష వైద్య అనుభవం, రోగుల పట్ల అవగాహన, క్లినికల్‌ నైపుణ్యాలు కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని ఎస్‌వీఎస్‌ ఎండీ డాక్టర్‌ కె.జె రెడ్డి అన్నారు. ఎస్‌వీఎస్‌ మెడికల్‌ కళాశాల, ఆస్పత్రి ఆధ్వర్యంలో గురువారం కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌ (ఈథస్‌–2026)ను ఆయన ప్రారంభించారు. మొత్తం 30 మెడికల్‌ కళాశాలల నుంచి దాదాపు 800మంది వైద్య విద్యార్థులు హాజరయ్యారు. మొదట వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ప్రత్యేక లెక్చర్స్‌ నిర్వహించారు. అనంతంర ఆధునిక వైద్య విధానాలు, శాసీ్త్రయ పరిశోధనలు, క్లినికల్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌వీఎస్‌ డైరెక్టర్‌రాంరెడ్డి, ప్రిన్సిపాల్‌ జోషి, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హరిప్రసాద్‌రెడ్డి, పలు విభాగాల హెచ్‌వోడీలు ఇతర వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement