ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్‌ బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్‌ బలవన్మరణం

Nov 13 2026 4:05 AM | Updated on Nov 13 2026 4:05 AM

గోపాల్‌పేట: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ ఆటోడ్రైవర్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని చెన్నూరు వెనికి తండాకు చెందిన దేవ్యానాయక్‌ (35) కొన్ని సంవత్సరాలుగా తల్లి, భార్య, పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని గాజులరామారం ప్రాంతంలో దేవేందర్‌నగర్‌లో అద్దెఇంటిలో నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఇంటిపై రుణం తీసుకోగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాయిదాలు చెల్లించలేకపోయారు. దీనికి తోడు హైదరాబాద్‌లో ఫైనాన్స్‌పై ఆటో తీసుకుని నడుపుతుండగా, బకాయిలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్‌ సంస్థ వారు ఆటోను తీసుకెళ్లారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో అతని తల్లి లక్ష్మి రెండురోజుల క్రితం స్వగ్రామం చెన్నూరు వెనికి తండాకు వచ్చింది. గురువారం భార్య ఇళ్లలో పనిచేసేందు కు, పిల్లలు పాఠశాలకు వెళ్లి న సమయంలో హైదరాబా ద్‌లోని అద్దె నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేవ్యానాయక్‌కు భార్య భాగ్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైనట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. కొన్ని నెలలుగా ఇంటి రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో ఇంటికి వెళ్తే ఎక్కడ తాళం వేస్తారో, సీజ్‌ చేస్తారోనని ఆందోళన చెందినట్లు అతడి స్నేహితులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement