స్వామివారి దర్శనం అనంతరం ఆడపడుచులకు పుట్టింటి వారు స్వయంగా కొత్త గాజులు వేయించడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం. జాతరలోని గాజుల దుకాణాల వద్ద అన్నలు, మేనమామలు తమ ఆడపడుచులకు గాజులు తొడిగిస్తారు. ఆ గాజుల గలగలల్లో ఆప్యాయత, అనుబంధాలు ప్రతిధ్వనిస్తాయి. మరోవైపు బంధువుల కోసం బొగ్గులపై కాల్చిన మాంసంతో ప్రత్యేక విందులు సిద్ధం చేస్తారు. తోటల్లో చెట్ల కింద కుటుంబసభ్యులంతా కలిసి భోజనాలు చేస్తూ కబుర్లలో మునిగిపోతారు. ఈ విందులు, వినోదాలు జాతరలో ప్రత్యేక అనుభూతిగా నిలుస్తాయి.


