మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఉమ్మడి మహబూబ్‌గర్ జిల్లాలో కురుమూర్తిస్వామి జాతరకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. భక్తుల సౌకర్యార్థం ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు రీజియన్ పరిధిలోని ఐదు డిపోల నుంచి మొత్తం 123 బస్సు సర్వీసులు నడపనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15న మొదటి రోజు నాగర్‌కర్నూల్ డిపో నుంచి 10, మహబూబ్‌నగర్ నుంచి 8, కొల్లాపూర్, వనపర్తి నుంచి 4 చొప్పున, నారాయణపేట నుంచి 3 ఇలా 29 బస్సులను ఏర్పాటు చేశారు. సోమవారం ఉద్దాల మహోత్సవం ఉండడంతో 16వ తేదీన వనపర్తి డిపో నుంచి 17, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ నుంచి 15 చొప్పున, కొల్లాపూర్ నుంచి 9, నారాయణపేట నుంచి ఏడు, మొత్తం 63 బస్సులు నడపనున్నారు. అలాగే 17వ తేదీన మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ డిపోల నుంచి 8 చొప్పున, కొల్లాపూర్ నుంచి 4, నారాయణపేట నుంచి 3 ఇలా 31 బస్సులు నడుస్తాయి. ప్రయాణికులు ఈ ప్రత్యేక బస్సుల సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పి.సంతోష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.


