ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Nov 12 2026 1:01 AM | Updated on Nov 12 2026 1:01 AM

ఎర్రవల్లి: విధి నిర్వహణలో నిరంతరం నిమగ్నమై ఉండే పోలీస్‌ సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పదో పటాలం కమాండెంట్‌ అలెక్స్‌ అన్నారు. బుధవారం మండలంలోని పదో బెటాలియన్‌లో ఉచిత వెరికోస్‌ వెయిన్స్‌ వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ ఏసీఎన్‌ వాస్కులర్‌ ఆస్పత్రి వైద్యనిపుణులు పాల్గొని వెరికోస్‌ వెయిన్స్‌, స్సైడర్‌ వెయిన్స్‌, కాళ్లు, పాదాల వాపులు, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు, పాదాల వేళ్లకు గ్యాంగ్రీన్‌, కాళ్లపై ఏర్పడే అల్సర్లు, గాయాలు వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. అదేవిధంగా ఉచితంగా వాస్కులర్‌ సర్జన్‌ సంప్రదింపులతో పాటు సుమారు రూ.5వేల విలువైన కలర్‌ డాప్లర్‌ స్కీనింగ్‌ పరీక్షలను కూడా అందించారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ మాట్లాడుతూ.. బెటాలియన్‌ సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ ఉచిత వైద్యశిబిరం ద్వారా లభిస్తున్న సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అవసరమైతే తమ కుటుంబ సభ్యులను కూడా వైద్యపరీక్షలకు తీసుకొచ్చి ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన వైద్యసలహాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ ఆదినారాయణ, అసిస్టెంట్‌ కమాండెంట్‌ వెంకటరమణ, ఆర్‌ఐలు నరసింహరాజు, రాజేశం, తిరుపతి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement