మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా యువజన, క్రీడల అధికారిగా ఎస్.శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఎల్‌బీ స్డేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(శాట్) కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనకు మహబూబ్‌నగర్ డీవైఎస్‌ఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వచ్చే నెలలో జిల్లాకేంద్రంలో ప్రతిష్టాత్మకమైన ఖేలో ఇండియా జాతీయస్థాయి క్రీడలు ఉండడంతో ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. శ్రీనివాస్ గతంలో పాలమూరు డీవైఎస్‌ఓగా ఐదున్నరేళ్ల పాటు పనిచేసి ఈ ఏడాది ఏప్రిల్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతిపై శాట్ కార్యాలయానికి బదిలీ అయ్యారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీఈడీ కళాశాలలో హిందీ, ఉర్దూ బోధించేందుకు అధ్యాపకుల నియామకానికి ప్రభుత్వం అనుమతించిందని ప్రిన్సిపాల్ గోవిందరాజులు తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 16వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 9948696440 నంబర్‌లో సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
పత్తి క్వింటా రూ.9,049
జడ్చర్ల: బాదేపల్లి యార్డులో బుధవారం పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరుగా సాగా యి. యార్డుకు 926 బస్తాల పత్తి రాగా క్వింటా గరిష్టంగా రూ.9,049, కనిష్టంగా రూ.8,589 ధరలు లభించాయి. 10,398 బస్తాల ధాన్యం రాగా క్వింటా గరిష్టంగా రూ.3,859, కనిష్టంగా రూ.2,389, మొక్కజొన్న 3354 బస్తాలు రాగా గరిష్టంగా రూ.3,213, కనిష్టంగా రూ.2,739, వేరుశనగ గరిష్టంగా రూ.8,571, కనిష్టంగా రూ.5,726 ధరలు లభించాయి.
గ్రామీణాభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి, పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రామ పంచాయతీ, గ్రామ సంఘాలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ ప్రతిపాదనలు, గ్రామీణ నీటి సరఫరా మరమ్మతులు, పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై సమీక్షించారు. పెండింగ్ బిల్లులు, జియో ట్యాగింగ్, జల్‌శక్తి అభియాన్ పురోగతిని పరిశీలించారు. పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటిస్తూ నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, పీఆర్ ఎస్‌ఈ మల్లయ్య పాల్గొన్నారు.


