భూత్పూర్: ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో ప్రభావితమైన వ్యక్తులే నేడు దేశంలో ఉన్నత పదవుల్లో కొనసాగుతూ, ప్రపంచ స్థాయిలో దేశం ప్రాభవాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారని తెలంగాణ బహుదిక్ ప్రాంత సంఘ్ ప్రతినిధి జయదేవ్ అన్నారు. శనివారం భూత్పూర్‌లోని న్యూఎర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి వంద రోజుల కార్యక్రమం ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు భూత్పూర్ చౌరస్తా నుంచి పట్టణ వీధుల మీదుగా నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల పథసంచలనానికి బీజేపీ రాష్ట్ర నాయకులు శాంతికుమార్, ఎగ్గని నర్సింహులు, జిల్లా నాయకులు సుధీర్‌కుమార్ తదితరులు పూలు చల్లి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ గత 12 ఏళ్లలో దేశ పాలనలో సమూల మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. గత పాలనలకు భిన్నంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని కొంతకాలం నియంత్రించడంలో, జలసంధిలో చమురు నౌకల రాకపోకలకు ఆటంకాలు ఎదురైన సమయంలోనూ భారత నౌకల ప్రయాణం కొనసాగడంలో దేశ దౌత్య సామర్థ్యం కనిపించిందని అన్నారు. ప్రపంచంలోని 200 దేశాలు నేడు భారత్ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్, మాజీ న్యాయమూర్తి అచ్యుతారెడ్డి, మానవీయ సంఘ్‌చాలక్ వసంతపు వెంకటేష్, పాలమూరు సీడ్స్ అధినేత వి. సుదర్శన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కెంద్యాల శ్యామ్, రాజగోపాల్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


