ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం కలిగిన వారే నేడు దేశాధినేతలు కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం కలిగిన వారే నేడు దేశాధినేతలు కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలి

Nov 8 2026 5:11 AM | Updated on Nov 8 2026 5:11 AM

ఈవీఎం గోదాంను

తనిఖీ చేసిన కలెక్టర్‌

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): కలెక్టరేట్‌ ఆవరణలోని ఈవీఎం, వీవీప్యాట్‌ గోదాంను జిల్లా కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా శనివారం తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నిర్వహించే నెలవారీ తనిఖీల్లో భాగంగా గోదాంను పరిశీలించి, సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఈవీఎంల భద్రత, రక్షణకు చేపట్టిన ఏర్పాట్లపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈవీఎం, వీవీప్యాట్‌ గదుల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ తనిఖీలో అదనపు కలెక్టర్‌ జేఎల్‌బీ హరిప్రియ, ఆర్డీఓ నవీన్‌, ఎన్నికల డీటీ జాఫర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫార్మా–డీ, లా పరీక్ష ఫలితాలు విడుదల

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ (పీయూ) ఫార్మా–డీ, లా కళాశాల పరీక్ష ఫలితాలను వీసీ శ్రీనివాస్‌ శనివారం విడుదల చేశారు. ఫార్మా–డీ మొదటి సంవత్సరం పరీక్షలకు 29 మందికి గాను 17 మంది, రెండో సంవత్సరం 51 మందికి గాను 46 మంది హాజరయ్యారు. ఎల్‌ఎల్‌బీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు ఆరో సెమిస్టర్‌ పరీక్షలకు 29 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, కంట్రోలర్‌ ప్రవీణ, ప్రిన్సిపాల్‌ భూమయ్య, ఈశ్వర్‌కుమార్‌, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పీయూలో కబడ్డీ,

చెస్‌ జట్ల ఎంపికలు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: అంతర్‌ యూనివర్సిటీ కబడ్డీ, చెస్‌ పోటీల్లో పాల్గొనన్ను పీయూ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. శనివారం పీయూ వీసీ శ్రీనివాస్‌ ఎంపికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. తమ ప్రతిభను చాటుకుని యూనివర్సిటీకి బంగారు పతకాలు సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపికై న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, పీడీ శ్రీనివాస్‌, కురుమూర్తి, ఆనంద్‌, సత్యభాస్కర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యూపీహెచ్‌సీల తనిఖీ

మహబూబ్‌నగర్‌ క్రైం: నగరంలోని పాత పాలమూరు, రామయ్యబౌలి, కుమ్మరివాడి, మోతీనగర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (యూపీహెచ్‌సీ)లను శనివారం డీఎంహెచ్‌ఓ డా. ఎ.శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది సమ్మెలో ఉన్నందున వివిధ ఆరోగ్య కేంద్రాల నుంచి డాక్టర్లను, సిబ్బందిని సర్దుబాటు చేసి ఆరోగ్య సేవలు నిరంతరాయంగా అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలకు అన్ని రకాల ప్రాథమిక ఆరోగ్యసేవలు అందించాలన్నారు. ముఖ్యంగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. అసంక్రమిత వ్యాధులైన అధిక రక్తపోటు, మధుమేహం, నోటి, బ్రెస్ట్‌, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లను అదుపులో ఉంచాలంటే 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్‌ చేయాల్సిందేనన్నారు. కార్యక్రమంలో ఎంహెచ్‌ఎన్‌ ప్రోగ్రాం నోడల్‌ అధికారి డా.శివకాంత్‌, సుభాష్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.

– వివరాలు IIలో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement