విద్యార్థులను ప్రోత్సహిస్తే అద్భుత ఫలితాలు సాధిస్తారు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను ప్రోత్సహిస్తే అద్భుత ఫలితాలు సాధిస్తారు

Nov 8 2026 5:11 AM | Updated on Nov 8 2026 5:11 AM

● ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన ప్రోత్సాహం, నాణ్యమైన శిక్షణ, సౌకర్యాలు అందిస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శ్రీరామ్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో చదువుకో తెలంగాణ కార్యక్రమంలో భాగంగా 2025–26లో పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడం ప్రభుత్వంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తమ ఫలితాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కార్పొరేట్‌ సంస్థలు కూడా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో విద్యారంగంలో గొప్ప మార్పు తీసుకురావచ్చని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం శ్రీరామ్‌ గ్రూప్‌ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. అనంతరం జిల్లా టాపర్‌ ఆరాధ్య (జెడ్పీహెచ్‌ఎస్‌ పెద్ద ఆదిరాల)కు రూ.2లక్షల చెక్కు, దేవరకద్ర నియోజకవర్గ టాపర్‌ నిశిత (జెడ్పీహెచ్‌ఎస్‌ దేవరకద్ర), మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం టాపర్‌ సాన్వీ (బేసిక్‌ ప్రాక్టీస్‌ హైస్కూల్‌)లకు చెరో లక్ష, మండల టాపర్లకు రూ.10వేల చొప్పున చెక్కులను అందజేశారు. శ్రీరామ్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఏజీఎం సతీష్‌, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్‌, వందేమాతరం ఫౌండేషన్‌ సమయన్వకర్త రవీందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ పర్యవేక్షకులు గుండా మనోహర్‌, బాలుయాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement