ఊకచెట్టు వాగు వద్ద ఘోర ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఊకచెట్టు వాగు వద్ద ఘోర ప్రమాదం

Nov 7 2026 12:54 AM | Updated on Nov 7 2026 12:54 AM

● వంతెనపై నుంచి పడిపోయిన కారు, బైక్‌..

● ముగ్గురికి గాయాలు,

ఒకరి పరిస్థితి విషమం

● క్రాష్‌ బారియర్లు లేకపోవడంపై

గ్రామస్తుల ఆగ్రహం

మదనాపురం: మండలంలోని ఊకచెట్టు వాగు వంతెన సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు ముందు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో రెండు వాహనాలు అదుప ుతప్పి రోడ్డు పక్కనున్న సుమారు 20 అడుగుల లోతులో పడిపోయాయి. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న నెలివిడికి చెందిన బాలు, రాములుగౌడ్‌ తీవ్రంగా గాయపడ్డారు. బాలు తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం మహ బూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. రాములుగౌడ్‌కు కాలి గాయాలయ్యాయి. కారులో ఉన్న చిన్నారులకు సైతం గాయాలయ్యాయి. స్థానికులు, 108 సిబ్బంది క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

రక్షణ కవచాలేవి?

ఊకచెట్టు వాగుపై రూ.9 కోట్లతో నూతన వంతెన నిర్మించినప్పటికీ, వంతెన దాటిన తర్వాత రహదారి మట్టి రోడ్డుగా మారే ప్రాంతంలో క్రాష్‌ బారియర్లు, రక్షణ గోడలు ఏర్పాటు చేయకపోవడంపై గ్రామస్తు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. రోడ్లు, భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాద తీవ్రతకు కారణమని ఆరోపిస్తున్నారు. రక్షణ కవచాలు ఏర్పాటు చేసి ఉంటే వాహనాలు లోతులోకి పడిపోయేవి కావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement