పీయూలో విద్యార్థుల ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

పీయూలో విద్యార్థుల ఎంపికలు

Nov 7 2026 12:54 AM | Updated on Nov 7 2026 12:54 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూలో అంతర్‌ కళాళాల ఎంపిక నిర్వహిస్తున్నట్లు పీడీ శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు 7న మహిళల కబడ్డీ, పురుషుల చెస్‌, 9న పురుషుల హాకీ, తైక్వాడో విభాగాల్లో ఎంపికలు ఉంటాయని, 25 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలబాలికలు, బోనోఫైడ్‌, ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌తో రావాలని సూచించారు. ఈమేరకు పోటీలను పీయూ స్పోర్ట్స్‌ కాంపెక్స్‌లో ఉదయం 10గంటలకు నిర్వహిస్తామని తెలిపారు.

ఉత్సాహంగా

అథ్లెటిక్స్‌ ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో శుక్రవారం ఉమ్మడి జిల్లాస్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–14 బాలబాలికల అథ్లెటిక్స్‌ ఎంపికలు నిర్వహించారు. 100 మీ., 200మీ, 400మీ, 600మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌, హైజంప్‌, షాట్‌ఫుట్‌, డిస్కస్‌త్రో అంశాల్లో ఎంపికలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపికలకు దాదాపు 250 మందికిపైగా బాల, బాలికలు హాజరయ్యారు. ఎంపికలను జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రానున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో క్రీడాకారులు పతకాలు సాధించి ఉమ్మడి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీలు ఆనంద్‌కుమార్‌, వినోద్‌, మొగులాల్‌, శ్రీనివాసులు, జి.శ్రీనివాసులు, ఖాజా, అరుణజ్యోతి, రాజు, ఉమాదేవి, నాగమణి, సుగుణ, రాకేష్‌వర్మ, శ్రీనివాస మొయిన్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement