ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో కలెక్టర్‌ ముఖాముఖి | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో కలెక్టర్‌ ముఖాముఖి

Nov 7 2026 12:48 AM | Updated on Nov 7 2026 12:48 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాకేంద్రంలోని బాసర ఐఐఐటీ కళాశాలను కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన ప్రమాణాలు, చదువు, హాస్టల్‌ వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వేసి విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే క్రమశిక్షణతో చదవాలని సూచించారు. కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో నిర్వహిస్తున్నామని, సొంత భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్‌ శ్రవణ్‌కుమార్‌, అధ్యాపకులు షకీల్‌, లక్ష్మీనారాయణ, స్వాతి, అర్జున్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement