ఎల్‌నినో ప్రభావాలపై ముందస్తు చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో ప్రభావాలపై ముందస్తు చర్యలు చేపట్టాలి

Nov 7 2026 12:48 AM | Updated on Nov 7 2026 12:48 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌ నుంచి వివిధ అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మండల స్థాయి అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు ప్రతిరోజూ ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. జిల్లా అధికారులు తమ పర్యటనల వివరాలతో టూర్‌ డైరీలను ప్రతి నెల సమర్పించాలన్నారు. కోర్టు కేసులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి గడువులోగా కౌంటర్లు దాఖలు చేయాలని, కేసుల వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. ప్రజావాణి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పెండింగ్‌ ఫైళ్లను సోమవారం లోపు పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి ఆలస్యంగా వచ్చే, అనుమతి లేకుండా గైర్హాజరయ్యే అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతి బుధవారం కేటాయించిన మండలాలను సందర్శించి అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంపై సమీక్షించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, ఇతర జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement