9 ఏళ్ల తర్వాత.. అధ్యాపకుల ర్యాటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

9 ఏళ్ల తర్వాత.. అధ్యాపకుల ర్యాటిఫికేషన్‌

Nov 6 2026 1:50 AM | Updated on Nov 6 2026 1:50 AM

● 2017లో చివరిసారిగా

నిర్వహించిన పీయూ అధికారులు

● ప్రైవేటు డిగ్రీ, బీఈడీ, బీపెడ్‌, ఫార్మసీ,

లా కళాశాలల్లో ప్రక్రియ

● 12 సబ్జెక్టులకు సంబంధించి

140 మంది అధ్యాపకులకు ఇంటర్వ్యూ

● అర్హతలు, బోధనా నైపుణ్యాల

పరిశీలన.. నాణ్యమైన విద్యే లక్ష్యం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రైవేటు కళాశాలల్లో అధ్యాపకుల అర్హతలు, బోధనా నైపుణ్యాలపై పర్యవేక్షణకు పాలమూరు యూనివర్సిటీ (పీయూ) అధికారులు శ్రీకారం చుట్టారు. యూనివర్సిటీ పరిధిలో ని ప్రైవేటు డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపెడ్‌, ఫార్మసీ, లా కళాశాలల్లో అధ్యాపకుల ర్యాటిఫికేషన్‌ ప్రక్రియ చేపట్టారు. చివరిసారిగా 2017లో అప్పటి వీసీ రాజర త్న ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహించగా.. దాదా పు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల కాకపోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ర్యాటిఫికేషన్‌కు సహకరించలేదని సమాచారం. ప్రస్తుతం విద్యాసంవత్స రం ప్రారంభంలోనే అధికారులు ఈ ప్రక్రియను చేపట్టారు. పీయూ పరిధిలో సుమారు 110 కళాశాలలు ఉండగా.. వాటిలో 24 వేల మందికిపైగా వి ద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆయా కళాశాలల్లో అన్ని సబ్జెక్టులకు అర్హులైన అధ్యాపకులు ఉన్నారా? వారి విద్యార్హతలు, బోధనా అనుభవం ఏమిటి? అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

సబ్జెక్టు నిపుణులతో ఇంటర్వ్యూలు

ర్యాటిఫికేషన్‌ ప్రక్రియను సబ్జెక్టు నిపుణులతో కూడిన కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రతి అధ్యాపకుడి ర్యాటిఫికేషన్‌కు నిర్ణీత ఫీజును కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీకి చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం సంబంధిత సబ్జెక్టు నిపుణులు అధ్యాపకులతో ఇంటర్వ్యూలు నిర్వహించి వారి అర్హతలు, బోధనా సామర్థ్యాలను అంచనా వేస్తున్నారు. గత శనివారం ప్రారంభమైన ఈ ప్రక్రియలో గురువారం సాయంత్రం నాటికి 12 సబ్జెక్టులకు సంబంధించి 140 మంది అధ్యాపకుల ర్యాటిఫికేషన్‌ పూర్తయింది. మిగిలిన సబ్జెక్టులకు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

కొన్ని ప్రైవేటు కళాశాలల్లో అవసరమైన సబ్జెక్టు అధ్యాపకులు లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒ కే అధ్యాపకుడి సర్టిఫికెట్లను పలు కళాశాలలు చూపించడం, అర్హతలు లేని వ్యక్తులతో బోధ న చేయించడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలూ వినిపిస్తున్నా యి.ఈ నేపథ్యంలో ర్యాటిఫికేషన్‌ ద్వా రా అధ్యాపకుల అసలు అర్హతలు, అనుభ వం, బోధనా నైపుణ్యాలను నిర్ధారించే అవకా శం ఉంటుంది. తద్వారా నిబంధనలకు విరుద్ధంగా బోధన సాగించే కళాశాలలకు అడ్డుకట్ట ప డటంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement