బ్రహ్మాండనాయక.. పాగుంట వెంకన్న | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మాండనాయక.. పాగుంట వెంకన్న

Nov 6 2026 1:50 AM | Updated on Nov 6 2026 1:50 AM

కార్యక్రమాలు ఇలా..

● రేపటి నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

● ఏర్పాట్లు పూర్తిచేసిన నిర్వాహకులు

● జాతర ప్రాంగణంలో వెలసిన దుకాణాలు

కేటీదొడ్డి: మండలంలోని వెంకటాపురంలో భక్తుల కొంగుబంగారంగా వెలు గొందుతున్న శ్రీపాగుంట లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగే ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఇప్పటికే జాతర ప్రాంగణంలో మిఠాయి దుకాణాలు, రంగుల రాట్నాలు, వివిధ రకాల దుకాణాలను ఏ ర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందు లు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పా ట్లు చేస్తున్నారు. విద్యుత్‌, తాగునీరు, వాహనాల పా ర్కింగ్‌ సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నారు.

ప్రత్యేక బస్సులు ఏర్పాటు..

శ్రీపాగుంట వేంకటేశ్వరస్వామి జాతరకు గద్వాల ఆర్టీసీ డిపో అధికారులు ప్రత్యేకంగా బస్సులను నడపనున్నారు. జిల్లా కేంద్రం నుంచి దాదాపు 30 కి.మీ. దూరంలో ఆలయం ఉంది. గద్వాల నుంచి రాయచూర్‌ మార్గంలోని కొండాపురం స్టేజీ నుంచి వెంకటాపురం చేరుకోవచ్చు.

స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7న ప్రత్యేక పూజా కార్యక్రమాలు, 8న ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం 9న స్వామి వారి కల్యాణ మహోత్సవం, సాయంత్రం ప్రభోత్సవం, 10న సుప్రభాత సేవ, స్వామి వారి రథోత్సవం, 11న పల్లకీ సేవ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జాతర ఏర్పాట్లను ఆలయ ఈఓ పురేందర్‌తో కలిసి ఎస్‌ఐ శ్రీనివాసులు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement