చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి ఉత్సవాల పనులను అధికారులు ముమ్మ రం చేశారు. ఇప్పటికే ఆలయ పరిసరాల్లో ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రపరిచారు. స్వామివారి ప్రధాన ఆలయం, మెట్లు, రాజగోపురం, కోనేరు తదితర వాటికి రంగులు అద్దడం పూర్తి దశకు చేరుకున్నాయి. గురువారం రాజగోపురానికి విద్యుద్దీపాలతో అలంకరణ పనులు ప్రారంభించారు. కోనేరులో పారిశుద్ధ్య పనులు చేపట్టి మట్టిని తొలగిస్తున్నారు. అలాగే కోనేరు సమీపంలోని సత్రాలు, కల్యాణ మండపం, తదితర ప్రాంతాల్లో ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలను తొలగించారు. జాతర మైదానంలో డ్రెయినేజీ నిర్మించడంతో మురుగు దిగువకు పారుతోంది. బ్రహ్మోత్సవాల నాటికి అన్ని పనులను పూర్తిచేస్తామని ఆలయ చైర్మన్ బత్తుల బాల్‌రాజు, ఈఓ మదనేశ్వరెడ్డి తెలిపారు.


