మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియం, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో 8వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పోటీల్లో భాగంగా నిర్వహించనున్న కబడ్డీ పోటీలకు సంబంధించి గురువారం అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రెయినీ) సాయిశివాని స్టేడియాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కబడ్డీ పోటీల నిర్వహణకు అవసరమైన మైదానం ఏర్పాట్లు, క్రీడాకారులకు కల్పించాల్సిన మౌలిక సదుసాయాలు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, పారిశుద్ధ్యం వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించారు. క్రీడాకారులు, కోచ్‌లు, సాంకేతిక అధికారులు, ఇతర సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయా లని సంబంధిత అధికారులకు సూచించారు. కబడ్డీ పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చే యాలని, స్టేడియం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు క్రీడా మైదానాన్ని పోటీలకు అనువుగా సిద్దం చేయాలని ఆదేశించారు. అలాగే క్రీడాకారుల వసతి, భోజనం, రవాణా, వైద్య సేవలు, ఇతర ఆతిథ్య ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్ణీత గడువులోగా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, క్రీడాశాఖ సిబ్బంది, కోచ్‌లు పాల్గొన్నారు.


