● సెంచరీతో సత్తా చాటిన
రామ్‌కుమార్‌చారి
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లో జరుగుతున్న సీ–డివిజన్ వన్డే లీగ్ చాంపియన్‌షిప్‌లో హెచ్‌సీఏ డిస్ట్రిక్ట్–4 (మహబూబ్‌నగర్) జట్టు విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో జిల్లా జట్టు 138 పరుగుల తేడాతో సుట్టా న్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు 46.3 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో ఓపెనర్ రామ్‌కుమార్‌చారి (117 బంతుల్లో 11 ఫోర్లతో 110 పరుగులు) అద్భుతమైన చేశాడు. అభినవ్ 47 పరుగులు చేశాడు. అనంతరం బ్యా టింగ్‌కు దిగిన సుట్టాన్ జ ట్టు జిల్లా బౌలర్ల ధాటి కి వరుసగా వికెట్లను కోల్పోయింది. 42.1 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయింది. జిల్లా బౌలర్లు అభినవ్ 3, వసీకర్ 3, ధనూష్ 2 వికెట్లు తీశారు. వ న్డే లీగ్ మ్యాచ్‌లో జిల్లా జట్టు విజయం సాధించడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ హ ర్షం వ్యక్తం చేశారు. రానున్న మ్యాచుల్లో ఇదే స్ఫూ ర్తితో ఆడి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


