హాకీ జట్లకు క్రీడాకారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

హాకీ జట్లకు క్రీడాకారుల ఎంపిక

Nov 6 2026 1:50 AM | Updated on Nov 6 2026 1:50 AM

● ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపికల్లో

ప్రతిభ చాటిన క్రీడాకారులు

వనపర్తిటౌన్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థా యి హాకీ జట్ల ఎంపికలు గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బాలు ర క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాలికల విభాగంలో అండర్‌–14, అండర్‌–17, అండర్‌–19, బాలుర విభాగంలో అండర్‌–14, అండర్‌–19 కేటగిరీల్లో ఎంపికలు చేపట్టారు. వివిధ జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారుల ప్రతిభను పరిశీలించి ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి బోలమోని కుమార్‌ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు ఎస్‌.నిరంజన్‌ గౌడ్‌, ఎం.డీ. కిసర్‌ బాబా, పి.మన్యం, రామమోహన్‌, శిరీష, చంద్రకళ, గోవింద్‌, వెంకటస్వామి, ఆంజనేయులు, వహీద్‌, స్వామితోపాటు పలువురు సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement