మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: సీనియర్ సిటిజన్స్ ఫోరం సభ్యుల సేవలు ఎంతో గొప్పవని జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ కె.ఎస్.రవికుమార్ అన్నారు. గురువారం మెట్టుగడ్డలోని ‘ఫోరం’ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధుల సమస్యలే గాక కుటుంబ, సామాజిక అవగాహన, యువతకు మార్గదర్శకత్వం, వైద్య శిబిరాలు, ఉచిత న్యాయ అవగాహన సదస్సులు తరచూ నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, సీనియర్ సిటిజన్స్ ఫోరం ఉపాధ్యక్షుడు ఎ.రాజసింహుడు, ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం, సభ్యులు రామేశ్వరయ్య, కేవీ అశో క్, గంగాధర్, తిమ్మప్ప, ముక్తా శ్రీశైలం, డి.రాము లు, లలితమ్మ, విశ్వరూప, నాగశ్రీ పాల్గొన్నారు.


