మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులకు మెడికల్ కోడింగ్ రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు పీయూ ఫార్మసీ కళాశాలలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ నూర్జహన్ మా ట్లాడుతూ.. మెడికల్ కోడింగ్ రంగంలో నైపుణ్యా లు పెంపొందించుకుంటే విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కా ర్యక్రమంలో కన్వీనర్ విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ ఈశ్వర్, ప్రభాకర్‌రెడ్డి, సుదర్శన్, సిలాస్, ప్రదీ ప్, తరుణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
రూ.2.10 లక్షల విలువైన టపాసులు స్వాధీనం
● అనుమతులు లేకుండా విక్రయిస్తున్న నలుగురిపై కేసులు
జడ్చర్ల: అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న రూ.2.10 లక్షల విలువైన టపాసులను స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. దీపావళి పండుగ నేపథ్యంలో మండల పరిధిలోని పోలేపల్లి సెజ్ ప్రాంతంలో అక్రమంగా టపాసులు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నేరడి రవీందర్ వద్ద రూ.1,01,200, ఉదయగిరి సద్దాం వద్ద రూ.51 వేలు, సాయిదీప్ వద్ద రూ.32 వేలు, రాజు వద్ద రూ.26 వేల విలువైన టపాసులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.


