పర్యాటక కేంద్రంగా కొత్తచెరువు: యెన్నం | - | Sakshi
Sakshi News home page

పర్యాటక కేంద్రంగా కొత్తచెరువు: యెన్నం

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: నగర పరిధిలోని కొత్తచెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఆర్కిటెక్ట్‌ల బృందంతో కలిసి కొత్తచెరువు కట్టను పరిశీలించారు. పర్యాటకులను ఆకర్షించేలా చేపట్టాల్సిన పనులు, కల్పించాల్సిన సౌకర్యాలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రకృతి అందాలకు, పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగకుండా వివిధ పనులకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అంతకుముందు క్యాంప్‌ కార్యాలయంలో పండుగ సాయన్న జాతర వాల్‌పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం టీడీగుట్ట ప్రాంతానికి చెందిన రఫతున్నీసా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స కోసం సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ.1.50 లక్షల చెక్కును క్యాంప్‌ కార్యాలయంలో అందజేశారు. ఆయా కార్యక్రమాలలో నగర డిప్యూటీ మేయర్‌ ఎం.సురేందర్‌రెడ్డి, ముడా చైర్మన్‌ కె.లక్ష్మణ్‌యాదవ్‌, సిరాజ్‌ఖాద్రీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement