ఈసారి సాగు చేయడం లేదు.. | - | Sakshi
Sakshi News home page

ఈసారి సాగు చేయడం లేదు..

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

గత యాసంగిలో 20 ఎకరాల్లో వరి సాగు చేశా. ఈసారి మాత్రం పంట వేయొద్దని నిర్ణయించుకున్నా. ఐదు బోర్లు ఉన్నా.. ఈ వానాకాలంలో 15 ఎకరాల్లో వరి వేస్తే నీటిమట్టం తగ్గి రెండెకరాల పంట ఎండిపోయింది. నీళ్లు లేకపోవడంతో ఈసారి ఒక్క ఎకరంలోనూ పంట సాగు చేయాలనుకోవడం లేదు.. మా ఊరంతా కలిపి 20 ఎకరాల్లో వరి సాగు చేయడమూ కష్టమే. – మల్లు వెంకటేశ్వర్‌రెడ్డి, రైతు,

మాచన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ రూరల్‌

పంట వేయొద్దంటే ఎలా బతకాలి

గత యాసంగిలో రెండెకరాల్లో వరి సాగు చేశా. ఈసారి నీటి వసతి లేక 20 గుంటలకు తగ్గించా. బావిలో నీరు ఊరడం లేదు. అప్రకటిత విద్యుత్‌ కోతలతో రోజుకు ఆరు గంటలే కరెంట్‌ వస్తోంది. వరి వేయొద్దంటే మేమెలా బతకాలి. ప్రభుత్వం ఏ పంట సాగు చేయాలో స్పష్టంగా చెప్పాలి. ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడంతో పాటు పెట్టుబడి సాయం, ఆర్థిక భరోసా ఇవ్వాలి.

– కంచిమి రాములు, రైతు, బుద్ధారం, హన్వాడ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement