పాలమూరు: నవంబర్ 9న నిర్వహించనున్న న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వెంకటాపూర్‌లో న్యాయ అవగాహన నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిరా ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ చట్టాలు, ఉచిత న్యాయ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎన్‌ఏఎల్‌ఎస్‌ఏ పేదరిక ని ర్మూలన పథకం, ఉచిత న్యాయ సహాయం, పిల్లల కోసం బాలస్నేహపూర్వక న్యాయ సేవ లు, మానసిక, మేధో వైకల్యం ఉన్నవారికి అందించే న్యాయ సేవలు, వరకట్న నిషేధ చట్టం, జాగృతి పథకం తదితర అంశాలను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జడ్జి సూచించారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు సంస్థను సంప్రదించి తగిన సహాయం పొందాలని తెలిపారు. ఎల్‌ఏడీసీఎస్ చీఫ్ రవీందర్ నాయక్, పాల్గొన్నారు.
పుస్తక పఠనాన్ని
అలవాటుగా చేసుకోవాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకోవాలని పీయూ వీసీ శ్రీనివాస్ సూచించారు. పీయూ లైబ్రరీలో ఏర్పాటు చేసిన 3 రోజుల పుస్తక ప్రదర్శనను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పుస్తకాలు చదవడం వల్ల ఉన్నత విద్య, పరిశోధనతో పాటు పోటీ పరీక్షల్లో రాణించేందుకు అవసరమైన జ్ఞానం లభిస్తుందని పేర్కొన్నారు. వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత పెంపొందించుకోవడానికి పఠనం దోహదపడుతుందన్నారు. పీయూ లో పోటీ పరీక్షల పుస్తకాలతో పాటు వివిధ మ్యాగజైన్లు, దినపత్రికలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు వాటిని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్ రమేష్‌బాబు, కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి,ఈశ్వర్‌కుమార్, భూమయ్య, కరుణాకర్‌రెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్ రాజ్‌కుమార్, అర్జున్‌కుమార్ పాల్గొన్నారు.
రేపు‘అథ్లెటిక్స్’ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఈనెల 7వ తేదీన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 ఉమ్మడి జిల్లా బాలబాలికల అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు బోనఫైడ్, ఆధార్‌కార్డులతో ఉదయం 9 గంటలకు స్టేడియంలో రిపోర్టు చేయాలని కోరారు.


