అలంపూర్: రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేస్తున్న మిరప పంటకు ముడత తెగుళ్లు సోకుతున్నాయి. తెగులుకు సకాలంలో నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జునరెడ్డి రైతులకు సూచించారు. ముఖ్యంగా మిరప, హైబ్రీడ్ మిరపకు పైముడత, కింది ముడత తెగుళ్లు ఆశిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
తెల్ల నల్లి (కింది ముడత):
తెల్ల నల్లి పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు కిందికి ముడ్చుకుంటాయి. దీంతో ఆకులు తిరగబడి పడవ ఆకారంలో కనబడతాయి. ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారి మొక్కల పెరగుదల ఆగిపోయి లేత ఆకులు ముద్దకడతాయి.
నివారణ:
లీటర్ నీటికి డైపెన్‌ధయురాన్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. ఉధృతిని బట్టి ఎకరాకు ఫానలోన్ 400 మి.లీ లేదా ఇంట్రిపిడ్ 400 మి.లీ పిచికారీ చేసుకోవాలి.
తామర పురుగు (పైముడత):
ఇవి ఆకుల నుంచి రసం పీల్చడం వలన ఆకులు పైకి ముడ్చుకుంటాయి. ఆకులు, పిందెలు, రాగి రంగులోకి మారి పూత, పిందె అభివృద్ధి నిలిచిపోతుంది.
నివారణ:
పై ముడత నివారణకు 10 లీటర్ల నీటికి 12.5 గ్రా ముల డైపెన్ ధయురాన్ 25 గ్రాములు లేదా ప్రిప్రోనిల్ 30 మి.లీ 15 గ్రాముల ఎసిఫెట్ కలిపి ఆకుల అడుగు భాగం తడిచేసేలా పిచికారీ చేయాలి.
పాడి–పంట


