18వ రోజుకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్ష | - | Sakshi
Sakshi News home page

18వ రోజుకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్ష

Oct 31 2026 8:01 AM | Updated on Oct 31 2026 8:01 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: తమ డిమాండ్ల సాధన కోసం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన దీక్షలు శుక్రవారం 18వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నగరంలోని టీటీడీ కల్యాణ మండపం ఎదుట దీక్ష శిబిరంలో కాచిన రాగి అంబలి తాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా తమ సర్వీసును రెగ్యులరైజ్‌ చేయాలని, ఈహెచ్‌ఎస్‌ హెల్త్‌ కార్డులు ఇచ్చి ఆరోగ్య భద్రత కల్పించాలని నినదించారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జాక్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌కుమార్‌, సభ్యులు ప్రవీణ్‌, రాజేష్‌, ప్రీతి, అభినయ్‌, ఏఎన్‌ఎంలు భారతి, మంజుల, మహేష్‌, బుచ్చిబాబు, యుగేందర్‌, నవీన్‌, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement