మహబూబ్‌నగర్ క్రీడలు: నగరంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్న పీఎంశ్రీ జిల్లాస్థాయి క్రీడాపోటీలు శుక్రవారం ముగిశాయి. పోటీల్లో జిల్లాలోని 24 పీఎంశ్రీ పాఠశాలల బాల, బాలికలు పాల్గొన్నా రు. ఖోఖో బాలుర విభాగంలో కోయిలకొండ ప్రథ మ, రాజాపూర్ ద్వితీయ, బాలికల్లో బాలానగర్ ప్రథమ, నవాబ్‌పేట జట్టు ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. సాయంత్రం జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో టీజీపీడీ, పీఈటీ అసోసి యేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్, పెటాటీఎస్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్గౌడ్, టోర్నమెంట్ కార్యదర్శి వేణుగోపాల్ తదితరులు విన్నర్, రన్నర్ జట్లకు ట్రోపీలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ప్రతిభచాటాలని కోరారు. ఇలాంటి టోర్నీలు విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీస్తాయన్నారు. విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి కి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్జీఎఫ్ మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్ బాబు, పీడీలు మొగులాల్, అన్వర్‌పాష, వెంకటమ్మ, ఖాజాపాష తదితరులు పాల్గొన్నారు.


