తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు

Oct 31 2026 8:01 AM | Updated on Oct 31 2026 8:01 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో కలెక్టర్‌ ఖుష్బూగుప్తా అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా లో తాగునీటి సరఫరా, నీటి వనరుల లభ్యత, వేసవిలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై విస్తృతంగా చర్చి ంచారు. భవిష్యత్‌లో కరువు పరిస్థితులు, నీటి కొర త వంటివి ఎదురైనా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో ఎక్కడెక్కడ తాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందో ముందుగానే గుర్తించి.. అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి శాఖ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంతోపాటు ఇతర శాఖలతో సమన్వ యం చేసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. గ్రామా ల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తొలుత గుర్తించేది గ్రామస్థాయి సిబ్బందేనని.. కాబట్టి గ్రా మస్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి మండల, జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచు లు, ఎంపీడీఓలు, మిషన్‌ భగీరథ, నీటిపారుదల, మున్సిపల్‌ కార్పొరేషన్‌ తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి వనరుల పరిస్థితిని పరిశీలించాలని, సమస్యలు గుర్తించిన వెంటనే పరి ష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన చోట అదనపు నీటి వనరులు, ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు, ఇతర అత్యవసర చర్యలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని చెప్పారు. జిల్లాకేంద్రంతోపాటు మహ బూబ్‌నగర్‌ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిసారించాలన్నా రు. కలెక్టర్‌ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, గ్రామాల వారీగా సమస్యలను తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించేందుకు ఇలాంటి సమీక్ష సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించడం అవసరం అన్నారు. సమావేశంలో నగర మేయర్‌ మమత, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, డీఆర్‌ఓ నిర్మల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నర్సింహారెడ్డి, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ జగన్‌మోహన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement