విద్యార్థి దశ కీలకం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి దశ కీలకం

Oct 31 2026 8:01 AM | Updated on Oct 31 2026 8:01 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, ర్యాగింగ్‌కు పాల్పడి భవిష్యత్‌ అంధకారం చేసుకోవద్దని ఎస్పీ జానకి అన్నారు. నగరంలోని ఎస్‌వీఎస్‌ డెంటల్‌ కళాశాలలో శుక్రవారం యాంటీ ర్యాగింగ్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌ తీర్చిదిద్దాల్సిన విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, తోటి విద్యార్థులను వేధించడం, అవమానించడం, మానసికంగా లేదా శారీరకంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణ అయితే యాంటీ ర్యాగింగ్‌ నిబంధనల ప్రకారం సస్పెన్షన్‌, పరీక్షల అనర్హత, హాస్టల్‌ నుంచి తొలగింపు, కళాశాల బహిష్కరణతోపాటు పోలీసులు చట్టప్రకారం కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌వీఎస్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ మునిశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

అర్నాబ్‌ సహాయక చర్యల్లో విద్యుత్‌ ఉద్యోగులు

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): అర్నాబ్‌ తుఫాన్‌ వల్ల అతలాకుతలమైన విద్యుత్‌ వ్యవ స్థ పునరుద్ధరణలో అక్కడి విద్యుత్‌ సిబ్బందికి సహకరించేందుకు గాను జిల్లా నుంచి విద్యుత్‌ ఉద్యోగులు వెళ్తున్నట్లు ఆ శాఖ ఎస్‌ఈ భీమానాయక్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని విద్యుత్‌ భవన్‌ నుంచి ప్రత్యేక వాహనాల్లో 30 మంది ఉద్యోగులు బయలుదేరగా.. జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న ఏపీలో తుఫాన్‌ వల్ల విద్యుత్‌ అంతరాయం ఏర్పడిన గ్రామాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. విద్యుత్‌లైన్లు తెగిపోవడం, వి ద్యుత్‌ స్తంభాలు విరిగి పోవడం, ట్రాన్స్‌ఫార్మ ర్లు పాడైపోవడం లాంటి సమస్యలతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ సమ స్యలను పరిష్కరించేందుకు జరుగుతున్న సయహాక చర్యలో జిల్లాకు చెందిన ఉద్యోగులు భాగస్వాములు అవుతారని చెప్పారు. పూర్తిస్థాయిలో విద్యుత్‌ పునరుద్ధరించిన అనంతరం జిల్లా ఉద్యోగులు తిరిగి వస్తారని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన ఉద్యోగులను ఆయన అభినందించా రు. కార్యక్రమంలో ఎస్‌ఏఓ వెంకటేశ్వర్లు, డీఈలు చంద్రమౌలి, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

రేపు ఉమ్మడి జిల్లా యోగా క్రీడాకారుల ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: నగరంలోని మెయిన్‌ స్టేడియంలో ఆదివారం ఉదయం 9 గంటలకు ఉమ్మడి జిల్లా యోగా సీనియర్‌ పురుషులు, మహిళల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా యోగా సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్‌కుమార్‌గౌడ్‌, చంద్రశేఖర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18– 21, 22– 25, 26– 30, 31– 35, 36– 40, 41– 45 ఏళ్లలోపు విభాగాల్లో ఎంపికలు ఉంటాయన్నారు. క్రీడాకారులు కళాశాల నుంచి వయస్సు నిర్ధారణ పత్రం, మిగతావారు ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌తో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం పీడీ అరుణజ్యోతి సెల్‌ నం.91772 52541ను సంప్రదించాలని సూచించారు.

ఆర్టీసీ కార్మికుల

సమస్యలు పరిష్కరించాలి

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రీజినల్‌ కార్యదర్శి వెంకటయ్య కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆర్‌ఎం సంతోష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రీజియన్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న సిబ్బంది బదిలీల దరఖాస్తులను పరిశీలించాలన్నారు. ప్రతి డిపోలో ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటుతోపాటు శాసీ్త్రయంగా రోడ్డు సర్వే ని ర్వహించి పనిగంటలు మార్పు చేయాలన్నారు. కార్మికులకు వారంలో తప్పనిసరిగా ఒక స్పెష ల్‌ ఆఫ్‌ డ్యూటీ కల్పించాలని, హైదరాబాద్‌ రూ ట్‌లోని స్టేజీల మార్పు ఆలోచనను విరమించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ప్రభాకర్‌, కృష్ణయ్య, వెంకటయ్య, శ్రీనివాసులు, నారాయణ, అంబయ్య, అశోక్‌గౌడ్‌, వెంకటేశ్వర్లు, బాల్‌నారాయణ, తిరుపతి, ఎండీ ఖయ్యూం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement