పాలమూరు: సురక్షిత్ బచ్చన్ అభియాన్– పోక్సో చట్టం–2012, పాన్ ఇండియా పాఠశాల అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అడ్డాకుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కేజీబీవీ మూసాపేటలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి న్యాయమూర్తి డి.ఇందిర, ఎంవీఓ ప్రకాష్ హాజరై మాట్లాడారు. బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులను కట్టడి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పోక్సో చట్టంలో ఉన్న ముఖ్యమైన నిబంధనలు విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. చిన్నదర్పల్లి ప్రభుత్వ పాఠశాల, నగరంలోని శ్రీనివాసకాలనీ పద్మాలయ హైస్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి న్యాయమూర్తి మహ్మద్ మునావర్ హాజరై మాట్లాడారు. జడ్చర్ల బ్రిలియంట్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసి పోక్సో చట్టం అవగాహన కార్యక్రమానికి మహ్మద్ ముదసిర్ హాజరై మాట్లాడారు. నగరంలోని రాంనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోక్సో చట్టం 2012పై అదనపు సీనియర్ సివిల్ జడ్జి జి.రాధిక హాజరై మాట్లాడారు. దేవరకద్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి న్యాయమూర్తి రవి శంకర్ హాజరయ్యారు.


