కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలి

Oct 30 2026 12:45 AM | Updated on Oct 30 2026 12:45 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: జీఓ నం.6ను పునఃపరిశీలించి ఆస్పత్రి కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాలు రూ.26 వేలకు పెంచాలని తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర కార్యదర్శి సురేష్‌ అన్నారు. గురువారం ఎదిర శివారులోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆవరణలో పారిశుద్ధ్య, సెక్యూరిటీ, సూపర్‌వైజర్‌ కార్మికులతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఏజెన్సీలను రద్దు చేసి కార్పొరేషన్‌ ద్వారా నేరుగా కార్మికులకు వేతనాలు అందించాలన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో కాంట్రాక్ట్‌ కార్మికులు అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం వచ్చే నెల 12 నుంచి ఆస్పత్రి కాంట్రాక్ట్‌ కార్మికులతో పోరుబాట నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సాయిప్రకాష్‌, శ్రీనివాస్‌, ఉమర్‌, శ్రీను, నరేష్‌, రామకృష్ణ, చిట్టెమ్మ, అనసూయమ్మ, అంజమ్మ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement