ప్రైవేట్‌ ఆస్పత్రుల ఉద్యోగులకు ఈపీఎఫ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ఆస్పత్రుల ఉద్యోగులకు ఈపీఎఫ్‌

Oct 30 2026 12:45 AM | Updated on Oct 30 2026 12:45 AM

పాలమూరు: జిల్లాలోని ప్రతి ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈపీఎఫ్‌ లబ్ధి చేకూర్చాలని డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాలో ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రుల డైరెక్టర్లు, వైద్యులతో ఎంప్లాయి ప్రావిడెంట్‌ ఫండ్‌ పోర్టల్‌ ఎంట్రీ స్టేటస్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం కింద వచ్చే వారికి పథక పరిధిలో చికిత్స చేయాలని, కారణాలు చెప్పి చికిత్సకు నిరాకరించరాదన్నారు. 20 మంది అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు, కార్మికులు కలిగి ఉన్న ప్రతి ఆస్పత్రి తప్పకుండా ఈ నెల 31 వరకు నమోదు చేసుకోవాలన్నారు. ఈపీఎఫ్‌ ఫండ్‌కు ఎంప్లాయి జీతం నుంచి 12 శాతం, యాజమాన్యం తరపున 12 శాతం ఉద్యోగుల ఈపీఎఫ్‌ ఖాతాలో జమ చేయాలన్నారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చట్టపరంగా చర్యలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో నోడల్‌ ఆఫీసర్‌ శివకాంత్‌, సిబ్బంది హన్మంతు, సిద్ధిక్‌, ఐఎంఏ అధ్యక్షుడు రాంమోహన్‌, సీనియర్‌ వైద్యుడు శ్యామూల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement