పాలమూరు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లావ్యాప్తంగా పలు పాఠశాలల్లో ‘సురక్షిత్ బచ్చన్ అభియాన్’ కార్యక్రమాలు నిర్వహించారు. పోక్సో చట్టం–2012పై పాన్ ఇండియా పాఠశాల అవగాహన కార్యక్రమం మొదటి దశలో విద్యార్థులకు చట్టంపై అవగాహన కల్పించారు. నగరంలోని శ్రీచైతన్య హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అపెక్స్ సెంట్రల్ స్కూ ల్, గ్యాలెక్సీ హైస్కూల్లో రెండో అదనపు న్యాయ మూర్తి రవిశంకర్, నవాబ్‌పేట కేజీబీవీ, బాలానగర్ ఉన్నత పాఠశాలల్లో మొబైల్ కోర్టు న్యాయమూర్తి మునవర్ పాల్గొన్నారు. జడ్చర్లలోని అక్షర హైస్కూల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర, అదనపు న్యాయమూర్తి ముదసిర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోక్సో చట్టంలోని నిబంధనలు, బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, లైంగిక వేధింపుల నివారణ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.


