డెంగీ కేసుల గుర్తింపు, పరీక్షలు, చికిత్సతో పాటు వ్యాధి వ్యాప్తిని అరికట్టడంపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి కేసుల వివరాలను సేకరించి ఎప్పటికప్పుడు సమీక్షించాలి. జ్వరాలు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు దోమల నివారణ చర్యలు చేపట్టాలి. పరీక్షల కిట్లు అందుబాటులో ఉండేలా చూడటం, బాధితులకు సకాలంలో వైద్యం అందించడం, ప్రైవేట్ వైద్య సంస్థల నివేదికలను పర్యవేక్షించడం ద్వారా పరిస్థితిని నియంత్రించాల్సిన అవసరం ఉంది.


