అగ్నిప్రమాదం.. నగదు, విలువైన పత్రాలు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదం.. నగదు, విలువైన పత్రాలు దగ్ధం

Oct 9 2026 1:08 AM | Updated on Oct 9 2026 1:08 AM

మాగనూర్‌: మండల పరిధిలోని నేరడగంలో తాళం వేసి ఉన్న ఇంట్లో ప్రమాదవశా త్తు అగ్నిప్రమాదం సంభవించి ఆస్తినష్టం వాటిళ్లిందని ఎస్‌ఐ అశోక్‌బాబు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. నేరడగం గ్రామానికి చెందిన రైతు షేకసింది వెంకట్రాములు ముంబైలోనే పని చేసుకుంటూ జీవించేవా డు. ఈనె 1న స్వగ్రామంలోని ఇంటికి తాళం వేసి భార్య కవితతో కలిసి ముంబై వెళ్లాడు. 6న (మంగళవారం) తెల్లవారుజామున ఇంటికి మంటలు అంటుకున్నట్లు గమనించిన వెంకట్రాములు అన్న కుమారుడు సాయిబన్న స్థానికులతో కలిసి ఇంటి తాళాలు పగులగొట్టి మంటలను అదుపుజేశాడు. అనంతరం ఫోన్‌ ద్వారా వెంకట్రాములుకు సమాచారం అందించాడు. బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్న బాధితుడు ఇంటిని పరిశీలించగా బీరు వాలో ఉన్న బట్టలు, రూ.48 వేల నగదు అలాగే మక్తల్‌లోని ప్లాట్ల కాగితాలు, ముంబైలోని ఐదు ఇండ్ల రిజిస్ట్రేషన్‌ పత్రాలతో పాటు విలువైన వస్తువులు కాలిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement