మహమ్మదాబాద్: నకిలీ సర్టి ఫికెట్ పుట్టించి కుటుంబసభ్యులను మోసం ఆస్తి మొత్తం కాజే సిన ఘటన మహమ్మదాబాద్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని అన్నారెడ్డిపల్లి తండాకు చెందిన హనుమంతు నాయక్ నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. ఈయనకు భార్యతో రుక్మిణి బాయితో పాటు దిలీ ప్, నీలం, శారదా, విజయ్ నలుగురు సంతానం. తండ్రి మరణం తర్వాత ఆస్తిపై భార్యతో పాటు కు మారులు, కుమార్తెలకు సమానహక్కులు లభిస్తా యి. కానీ చిన్న కుమారుడు విజయ్ ఆస్తిని ఎవ్వరికి పంచకుండా ఒక్కడే కాజేయాలనుకొని పథకం వేశాడు. పథకం ప్రకారం తల్లికి మాయమాటలు చెప్పి తన తండ్రికి తానొక్కడినే కుమారుడినని నకి లీ ఫ్యామిలీ సర్టిఫికెట్ చేపించుకున్నాడు. ఈ సర్టిఫికెట్ సాయంతో తండ్రి పేరిట ఉన్న దాదాపు ఐదెకరాల భూమితో పాటు బ్యాంకులో ఉంచిన బంగారం, నగదును కూడా కాజేశాడు. తర్వాత విష యం తెలుసుకున్న అన్న దిలీప్.. తమ్ముడు విజయ్‌పై ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అలాగే పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.


