స్పందించారు.. కాల్వ తీయించారు | - | Sakshi
Sakshi News home page

స్పందించారు.. కాల్వ తీయించారు

Oct 6 2026 12:48 AM | Updated on Oct 6 2026 12:48 AM

● ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్టకు రెవెన్యూ అధికారుల చర్యలు

అడ్డాకుల: మూసాపేట మండలంలో ఇసుక అక్రమ రవాణాపై ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మండలంలోని జానంపేట, తాళ్లగడ్డకు చెందిన ట్రాక్టర్లతో ఇసుకను డంపు చేసి టిప్పర్లకు నింపి సొమ్ము చేసుకుంటున్న దానిపై సాక్షి దినపత్రికలో ట్రాక్టర్లతో డంపు... టిప్పర్లకు నింపు శీర్షికన ఈనెల 3న కథనం ప్రచురితమైంది. సోమవారం తహసీల్దార్‌ రాజునాయక్‌, ఆర్‌ఐ అరుణ్‌కుమార్‌ తాళ్లగడ్డ వద్ద వాగు వద్దకు వెళ్లి ఇసుక తరలించే ప్రదేశాన్ని పరిశీలించారు. ట్రాక్టర్లతో ఇసుకను తరలించి చక్రాపూర్‌ రోడ్డు సమీపంలోని జానంపేట శివారులో డంపు చేసేవారు. అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక డంపింగ్‌ చేసే చోటుకు వాహనాలు వెళ్లకుండా జేసీబీతో కాల్వను తీయించారు. ట్రాక్టర్లు అక్కడికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ రాజునాయక్‌ తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement