అస్తవ్యస్తంగా రైస్‌మిల్లు నిర్వహణ
● రైస్‌మిల్లు సీజ్ అయ్యేనా..
● రూ.కోట్లు విలువ చేసే ధాన్యం మాయం
● రైస్‌మిల్లులో ధాన్యం గోల్‌మాల్
● 8,755,883 టన్నుల ధాన్యం కొరత
మండల కేంద్రంలో తాడూరు నుంచి జిల్లాకేంద్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు సమీపాన నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ ఆగ్రో ఇండస్ట్రీ రైస్‌మిల్లు నిర్వహణ అస్తవ్యస్థంగా ఉంది. రోడ్డు వెంట వెళ్లే, రైస్‌మిల్లు పరిసరాలకు సంబంధించి పోలాలకు వెళ్లే రైతులు నిర్వహణ సక్రమంగా లేదని సరి చేసుకోవాలంటూ తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదు. నేరుగా మిల్లు యజమానితో మాట్లాడిన రైతులకు దురుసుగా సమాధానం ఇచ్చేవాడని విచారం వ్యక్తం చేశారు.
మిల్లులో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు
తాడూరు: మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ ఆగ్రో ఇండస్ట్రీ రైస్ మిల్లులో సివిల్ సప్‌లై అధికారి రాజేందర్, స్థానిక పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా రైస్‌మిల్లులో ప్రభుత్వానికి సంబంధించిన 8,755,883 టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తించారు. ఈ ధాన్యం విలువ దాదాపు రూ.19.59 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.
కేసుతోనే రైస్‌మిల్లు సీజ్ అయ్యేనా
మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ ఆగ్రో ఇండస్ట్రీ మిల్లులో ఇంత భారీ ఎత్తున ధాన్యం నిల్వ లు ఉండడం, దాదాపు 19.59 కోట్లు విలువ కలి గిన ధాన్యాన్ని అధికారులు గుర్తించారు. కానీ దీని కి బాధ్యులైన వారిపై చర్యలు ఎంతవరకు తీసుకుంటారనే విషయంలో రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి అవినీతికరమైన రైస్‌మిల్లులను అధికారులు ప్రోత్సహించకుండా సీజ్ చేసి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని స్థానిక రైతులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కోట్ల అవినీతికి పాల్పడి న రైస్‌మిల్లును సీజ్ చేయడంతోపాటు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలుకు ప్రభుత్వం చొరవ చూపాలని, మిల్లు యజమాని సుధాకర్‌రావు వ్యవహారం సరిగ్గా లేదని, తమపై దురుసుగా ప్రవర్తించడంతోపాటు, ప్రతాపం చూపుతుంటారని రైతులు విచారణ వ్యక్తం చేశారు.


