ఊట్కూర్‌ శివారులో కృష్ణజింకను వేటాడారు.. షాద్‌నగర్‌లో పట్టుబడ్డారు | - | Sakshi
Sakshi News home page

ఊట్కూర్‌ శివారులో కృష్ణజింకను వేటాడారు.. షాద్‌నగర్‌లో పట్టుబడ్డారు

Sep 29 2026 12:51 AM | Updated on Sep 29 2026 12:51 AM

నారాయణపేట/షాద్‌నగర్‌: నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండలం నిడుగుర్తి–లక్ష్మీపల్లి శివారులో అడవిలోకి చొరబడి తుపాకీతో వేటాడి.. కృష్టజింకను చంపి అక్రమంగా మాంసాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సో మవారం ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ శివా రులోని రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద తొమ్మిది మంది ని షాద్‌నగర్‌ పోలీసులు, ఎస్‌ఓటీ సిబ్బంది పట్టుకున్నారు. రాయికల్‌ టోల్‌గేట్‌ వద్ద తనిఖీల్లో 13 కిలో ల కృష్ణజింక మాంసం లభ్యమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను షాద్‌నగర్‌ డీసీపీ శిరీష రా ఘవేంద్ర విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి..

హైదరాబాద్‌కు చెందిన ఎండీ హాజీ ఉద్దీన్‌ తన స్నేహితులతో కలిసి సెప్టెంబర్‌ 26న (శనివారం) అర్ధరాత్రి కారులో బయలుదేరి, 27న ఉదయం నిడుగుర్తి–లక్ష్మీపల్లి శివారులోని అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం ఉదయం 7 న ుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడ సంచరించారు. అటవీ ప్రాంతంలో హాజీ ఉద్దీన్‌ లైసెన్స్‌డ్‌ రైఫిల్‌తో కృష్ణజింకను కాల్చి చంపారు. అనంతరం మృత జింకను ముక్కలుగా చేసి మాంసాన్ని ప్యాక్‌ చేసి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు.

టోల్‌గేట్‌ వద్ద పట్టివేత

సోమవారం రాయికల్‌ టోల్‌గేట్‌ సమీపంలో షాద్‌నగర్‌ పోలీసులు, ఎస్‌ఓటీ సిబ్బంది తనిఖీలు చేపట్టగా కారులో కృష్ణజింక మాంసం బయటపడింది. దీంతో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిలో ఊట్కూర్‌ మండలానికి చెందిన ఎండీ రియాజ్‌తో పాటు మరో ఇద్దరిని వేట జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి వివరాలు సేకరించారు. నిందితుల వద్ద నుంచి సుమారు 13 కిలోల కృష్ణజింక మాంసం, టెలిస్కోప్‌, సైలెన్సర్‌ అమర్చిన 315 రైఫిల్‌, కెమెరా, స్మార్ట్‌ఫోన్లు, రూ.28,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తొమ్మిది మందిపై కేసు

ఈ కేసులో ఎండీ హాజీ ఉద్దీన్‌, మీర్‌ ముక్తార్‌ అలీ, ఎండీ తాజుముల్‌, మీర్‌ రజా అలీఖాన్‌, ఖుర్రం ఖాన్‌, సయ్యద్‌ సల్మాన్‌ అలీ, ఎండీ అఫ్రోజ్‌ ఖాన్‌, ఎండీ అబ్దుల్‌ అజీజ్‌, ఎండీ రియాజ్‌పై కేసు నమోదు చేశారు.

లైసెన్స్‌ ఉన్నా..

వేటకు వాడితే నేరమే

రైఫిల్‌కు లైసెన్స్‌ ఉన్నప్పటికీ దాన్ని వన్యప్రాణుల వేటకు ఉపయోగించడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972లోని సెక్షన్లు 9, 39, 50, 51, 57తో పాటు ఆర్‌మ్స్‌ యాక్ట్‌ సెక్షన్‌ 30 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, వన్యప్రాణుల వేట లేదా అక్రమ రవాణాపై సమాచారం ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు.

ఊట్కూర్‌ మండలం నిడుగుర్తి– లక్ష్మీపల్లి శివారులో వేట

మాంసాన్ని ముక్కలుగా చేసి

హైదరాబాద్‌కు తరలింపు

తొమ్మిది మంది అదుపులోకి.. 13 కిలోల మాంసం, రైఫిల్‌ స్వాధీనం

24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు, ఎస్‌ఓటీ, అటవీశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement