మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా అండర్–14, 17ఎస్‌జీఎఫ్ బాలికల వాలీబాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్‌లో బాలానగర్ జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి ఈ రెండు విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. ఈ రెండు విభాగాల్లో మహ్మదాబాద్ జట్లు రన్నరప్‌గా నిలిచాయి. గెలుపొందిన జట్లకు డీవైఎస్‌ఓ రాజశేఖర్‌రెడ్డి, జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ తదితరులు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభచాటాలన్నారు. క్రీడల్లో క్రమశిక్షణ ముఖ్యమని అన్నారు. జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయస్థాయికి ఎదిగి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రిటైర్డ్ పీడీ చెన్న వీరయ్య, డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్, జిల్లా ఎస్‌జీఎఫ్ మాజీ కార్యనిర్వాహక కార్యదర్శులు శారదాబాయి, రమేష్‌బాబు, పీడీలు రామేశ్వర్, ముస్తఫా, మమత, శ్రీనివాస్‌రెడ్డి, సుచేతన్‌రెడ్డి, అబ్దుల్లా, అయూబ్‌ఖాన్, ఉమాదేవి, గాయత్రి, రాములు, డీఎస్‌ఏ వాలీబాల్ కోచ్‌లు పర్వేజ్‌పాష, రహెమాన్ తదితరులు పాల్గొన్నారు.


