● తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
● 12వ రోజు గుండుమాల్,
మద్దూర్‌లో మహాపాదయాత్ర
కోస్గి రూరల్/కొత్తపల్లి: రానున్న 2028 ఎన్నికల్లో ముదిరాజ్‌లకు పెద్దపీట వేస్తామని, చివరి ఓసీ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. సోమవారం 12వ రోజు మహాపాదయాత్ర గుండుమాల్, మద్దూర్ మండలాలకు చేరుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక రెండేళ్లు మాత్రమే మిగిలిందని.. కోడంగల్, తెలంగాణలో వచ్చేది బీసీ ప్రభుత్వమన్నారు. రెడ్ల ఎమ్మెల్యే గడప లేకుండా చేసుడే మన ధర్మమన్నారు. వాల్మీకి బోయలను ఎస్టీలో, ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి బీసీ–ఏలో మారుస్తామన్నారు. రేవంత్‌రెడ్డి డబుల్ బెడ్రూం ఇల్లు, తులం బంగారం, రూ.4వేల పింఛన్, రైతుబీమా, రైతుభరోసా, రుణమాఫీ, యూరియా యాప్ అంటూ ప్రజలను మభ్య పెడులూ కాలయాపన చేస్తున్నాడన్నారు. తిరుపతిరెడ్డి దోచుకొనుడు.. ఆంధ్రా కాంట్రాక్టర్‌లకు పెటు్‌ుట్డ.. తమ్ముడికి ఓ నియోజకవర్గం.. అన్నకు అడ్మినిస్ట్రేషన్.. ఇంకో తమ్ముడికి మున్సిపల్.. అంటూ పంచుకుంటూ వస్తున్నాడు.. తాత జాగిర్ లేక్క.. తినుండ్రి బిడ్డ.. ఏ బొక్కలో దాచిపెట్టినా.. ఆ పైసలు, భూములను బయటకు తీస్తా.. మా పేద బిడ్డలకు పంచుతా.. రెడ్ల సోపతి, వెలమ సోపతి బంధు.. ఈ సీఎం పని చేయాలన్నా.. మాజీ సీఎం అయినా ముదిరాజ్ బిడ్డల శక్తితోనే అవుతాది.. బీసీలకు రాబోయే కాలంలో ముదిరాజ్‌లకు పెద్దపీటం మీద కూర్చోబెట్టి పరిపాలన చేపడుతామన్నారు. నా పైనా 80కేసులు పెట్టి వందల రోజులు చీకటి గదిలో పెట్టిన కేసీఆర్‌పై పోరాటం ఆపలేదన్నారు. గుండుమాల్ మండల కేంద్రంలో రోడ్డు వెడల్పులో భాగంగా కమీషన్ల కోసం పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని, గట్టలు సైతం కారుగబెట్టుతున్నారని మండిపడ్డారు. అనంతరం పలువురికి పార్టీ జెండా కప్పి ఆహ్వానించారు. మద్దూర్ మండల కేంద్రంలోని రోడ్డు వెడల్పు బాధితులు, నాయకులను స్టేషన్‌లో అరెస్టు చేయగా.. వారిని స్వయంగా పరామర్శించారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షురాలు స్వర్ణక్క, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు కృష్ణ, కల్నాల్ బిక్షపతి, పూజిత, అనిల్ ఉన్నారు.


