మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ/జడ్చర్ల: జిల్లాలో పలు ప్రాంతాల్లో గణపతి నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. శనివారం నగరంలోని భూత్పూర్ రోడ్‌లోని ముడా కార్యాలయం సమీపంలో ఉన్న బేబీ పాండ్, అప్పన్నపల్లిలోని గంగోస్‌కుంట వద్ద ఉన్న రెండు బేబీ పాండ్‌లలో చిన్నచిన్న విగ్రహాలను నిమజ్జనం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవపై జడ్చర్లలో నాగసాల చెరువులో పలు గణనాథులను నిమజ్జనం చేశారు. భక్తుల కోలాటాలు, భజనలు, టపాకుల మోతతో శోభాయాత్ర కొనసాగింది.
జడ్చర్ల నాగసాల చెరువులో గణనాథుడి
నిమజ్జనం


