● కొండాపూర్ గ్రామస్తుల్లో భయాందోళన
ధన్వాడ: మండలంలోని కొండాపూర్ గ్రామ శివారులో నల్లగుట్టపై సోమవారం ఉదయం చిరుత కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. కోయిల్‌కొండ వైపు వెళ్తున్న కొందరు గ్రామస్తులకు చిరుత కనిపించడంతో వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం గ్రామ శివారులో పంట పొలాల వద్ద ఓ మేకను చిరుత చంపి తిన్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో చిరుతను వెంటనే పట్టుకుని గ్రామాల వైపు రాకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.


