రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Sep 11 2026 11:21 AM | Updated on Sep 11 2026 11:21 AM

చిన్నచింతకుంట: రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. నియోజకవర్గంలో 13 విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు భూమిపూజలు చేశామని, ఇప్పటికే 550 ట్రాన్స్‌ఫార్మర్లు రైతులకు అందించామని తెలిపారు. తాజాగా మరో 800 ట్రాన్స్‌ఫార్మర్లు వచ్చాయని, వాటిని మండలాల వారీగా రైతులకు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, విద్యుత్‌ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి

800 ట్రాన్స్‌ఫార్మర్లు.. మండలాల వారీగా పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement