అర్హులైన వారు ఓటుహక్కుకు నమోదు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులైన వారు ఓటుహక్కుకు నమోదు చేసుకోవాలి

Sep 11 2026 11:21 AM | Updated on Sep 11 2026 11:21 AM

రాజాపూర్‌: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్‌ హరిప్రియ సూచించారు. ఓటరు నమోదు ప్రత్యేక క్యాంపెయిన్‌లో భాగంగా ఆదివారం రాజాపూర్‌ మండల కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఫారం–6, 7, 8 ద్వారా వచ్చిన దరఖాస్తులు, సవరణల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐఆర్‌లో నోటీసులు అందుకున్న వారికి ఈనెల 19న హియరింగ్‌ నిర్వహించనున్నట్లు డిప్యూటీ తహసీల్దార్‌ భారతి తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరూ ఓటుహక్కు కోల్పోకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ మంజుల, జీపీఓ కృష్ణయ్య, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement