కబడ్డీ ‘అకాడమీ’కి కూత | - | Sakshi
Sakshi News home page

కబడ్డీ ‘అకాడమీ’కి కూత

Sep 11 2026 11:21 AM | Updated on Sep 11 2026 11:21 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: పాలమూరు జిల్లా కేంద్రంలోని మెయిన్‌ స్టేడియం క్రీడలకు అడ్డాగా మా రుతోంది. ఇప్పటికే బాల, బాలికల వాలీబాల్‌ అకాడమీలు కొనసాగుతుండగా.. తాజాగా రాష్ట్రంలోనే తొలి బాలుర కబడ్డీ అకాడమీ ఇక్కడ అందు బాటులోకి వచ్చింది. ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి అత్యుత్తమ శిక్షణ అందించాలనే లక్ష్యంతో డీఎస్‌ఏ వాలీబాల్‌ అకాడమీలో అదనపు విభాగంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈనెల 7వ తేదీ (సోమవారం) నుంచి శిక్షణ ప్రారంభం కానుంది.

20 మంది బాలురకు ప్రవేశాలు

డీఎస్‌ఏ వాలీబాల్‌ అకాడమీలో 20 మంది బాలుర సామర్థ్యంతో కబడ్డీ అకాడమీని అదనపు విభాగంగా ఏర్పాటు చేశారు. కబడ్డీ అకాడమీలో బాలురకు ప్రవేశాల కోసం గత నెల 25, 26 తేదీల్లో జిల్లా కేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించారు. అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులతో కూడిన సెలక్షన్‌ కమిటీ సమక్షంలో ఎంపికలు జరిగాయని డీవైఎస్‌ఓ తెలిపారు. ఈ మేరకు కబడ్డీ అకాడమీలో ప్రవేశాలు పొందిన 20 మంది బాలుర పేర్ల వివరాలను మహబూబ్‌నగర్‌ జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు. అకాడమీకి ఎంపికై న క్రీడాకారులు: బి.కౌషిక్‌, పి.లక్ష్మిగణేష్‌ (ఖమ్మం), ఎం.నందకిషోర్‌ (వనపర్తి), సీహెచ్‌ రాహుల్‌ (నిజామాబాద్‌), వి.గౌతమ్‌ (మహబూబ్‌నగర్‌), బి.అజయ్‌ (నిజామాబాద్‌), ఎ.లింగు (ఆదిలాబాద్‌), ఎస్‌కే.రేహాన్‌ బాబా (నల్గొండ), బి.అర్జున్‌ (కామారెడ్డి), ఎ.భానుప్రకాశ్‌ (నల్గొండ), చరణ్‌ (మహబూబాబాద్‌), జి.లోకేష్‌ (ఆదిలాబాద్‌), ఖాజా అజీమ్‌ ఖాద్రీ (కరీంనగర్‌), ఎం.రోహిత్‌ (వరంగల్‌), కె.నీలకంఠ, ఎంకె జయక్రిష్ణ (మహబూబ్‌నగర్‌), డి.శివకుమార్‌ (వనపర్తి), ఎం.శివ శంకర్‌ (మహబూబ్‌నగర్‌), వి.సచిన్‌ (వికారాబాద్‌), జె.ఉమేష్‌కుమార్‌ రెడ్డి (ఖమ్మం).

రాష్ట్రంలోనే తొలి బాలుర కబడ్డీ అకాడమీ

20 మంది క్రీడాకారులకు ప్రవేశాలు..

పాలమూరులో నేటి నుంచి ప్రారంభం

సబ్‌జూనియర్‌ నుంచి

జాతీయ స్థాయి పోటీలే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement