తిమ్మాజిపేట: చేను మేసిందనే కారణంతో ఓ వ్యక్తి నాలుగు నెలల లేగదూడను ట్రాక్టర్‌కు కట్టి ఈడ్చుకెళ్లిన ఘటన మండలంలోని లక్ష్మణ్‌నాయక్‌తండాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటకు చెందిన అర్షద్ పొలంలో పాండునాయక్‌కు చెందిన లేగదూడ చేను మేసింది. దీంతో ఆగ్రహించిన అర్షద్ దూడను ట్రాక్టర్‌కు కట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనను గమనించిన తండావాసులు వెంటనే దూడ యజమాని పాండునాయక్‌కు సమా చారం అందించారు. అక్కడికి చేరుకున్న ఆయ న తీవ్రంగా గాయపడిన దూడను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన పోలీసు లు అర్షద్‌పై కేసు నమోదు చేశారు. గాయపడిన లేగదూడ పరిస్థితి విషమంగా ఉందని యజమాని తెలిపారు.
● చేను మేసిందని లేగ దూడను
ట్రాక్టర్‌కు కట్టి ఈడ్చుకెళ్లిన వైనం
● నిందితుడిపై కేసు నమోదు


