కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని సిలార్‌పల్లి వార్డులో ఉన్న కేఎల్‌ఐ కాల్వలో వృద్ధురాలు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ కురుమూర్తి, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిలార్‌పల్లికి చెందిన అంజనమ్మ (70) ఆదివారం ఉదయం కొడుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంత సేపటికి వృద్ధురాలు తిరిగి రాకపోవటంతో కొడుకు పర్వతాలు మిత్రులు, బంధువులతో కలిసి గాలించారు. అయితే అదే గ్రామానికి చెందిన చిన్నారి రాధిక తనకు అవ్వ కేఎల్‌ఐ కాల్వ వద్ద కనిపించిందని చెప్పడంతో కాల్వ వద్దకు వెళ్లి చూడగా అంజనమ్మ చెప్పులు, చేతికర్ర కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఫైర్ సిబ్బంది సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభించకపోవడంతో కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని గాలింపు కొనసాగిస్తామని ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు.
పిచ్చికుక్క కాటుకు
ఒకరు బలి
తెలకపల్లి: పిచ్చికుక్క కా టు వేయడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చో టు చేసుకుంది. గ్రామస్తు లు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని వ ట్టిపల్లికి చెందిన జలాల శ్రీనివాస్‌యాదవ్ (40) గత నెలలో పని నిమి త్తం తెలకపల్లికి వెళ్లాడు. అక్కడ ఓ పిచ్చి కుక్క కాటు వేసింది. వెంటనే స్థానిక ఆస్పత్రిలో చికి త్స అనంతరం ఇంటికి వచ్చాడు. కొద్దిరోజులకే మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో హైదరా బాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందాడు.మృతునికి భార్య, ఇద్దరు పిల్ల లు ఉన్నారు. శ్రీనివాస్‌యాదవ్ మృతితో గ్రా మంలో విషాధచాయలు అలుముకున్నాయి.
తల్లి మందలింపు..
కుమారుడి బలవన్మరణం
కొత్తకోట రూరల్: వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని సత్యహళ్లి గ్రామానికి చెందిన ఎం.కుమార్ (27) మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ ఎం.విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు కుమార్. అయితే కొంతకాలంలో పనులు చేయకుండా తిరుగుతుండడంతో మూడు రోజుల క్రితం తల్లి పార్వతమ్మ మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన ఈ నెల 4న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శనివారం అప్పరాల శివారులోని చెప్పరోని గుట్టపై మృతదేహాన్ని గుర్తించిన గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు కుమార్‌గా గుర్తించిన పోలీసులు.. ఆయన అన్న శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెరువులో
మృతదేహం లభ్యం
వనపర్తి రూరల్: పెబ్బేరు పట్టణంలోని మహభూపాల్ చెరువులో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌ఐ వెంకటేష్ గౌడ్ తెలిపారు. పురుషుడి (40) మృతదేహం తేలాడుతూ ఉందని తమకు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా బ్లూకలర్ జీన్స్ పాయింట్ ధరించి, కుడి చేతికి వెండి కడెం ధరించి ఉన్నాడన్నాడు. మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురికి తరలించామన్నారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిస్తే పెబ్బేరు పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ సూచించారు.


