● గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పల్లె రవి మృత్యువాత
మహబూబ్‌నగర్ క్రైం: మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారుడు పల్లె రవి మృతి చెందారు. బైక్‌పై రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మహబూబ్‌నగర్ రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. నగరంలోని క్రిస్టియన్‌పల్లికి చెందిన పల్లె రవి(48) భార్య వరలక్ష్మితో కలిసి బైక్‌పై శనివారం రాత్రి 9 గంటల సమయంలో క్రిస్టియన్‌పల్లి చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో రవి తీవ్రంగా గాయపడగా, భార్య వరలక్ష్మి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రవిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం ఎస్‌వీఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
పల్లెరవిని కోల్పోవడం బాధాకరం..
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పల్లె రవి లాంటి నిబద్ధత కలిగిన తెలంగాణ ఉద్యమకారుడిని కోల్పోవడం బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం పల్లె రవి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ చౌరస్తాలో పల్లె రవి చిత్రపటానికి పూలమాల వేశారు. రవి మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, కార్పొరేటర్ నరేందర్, గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రవిని కోల్పోవడం దురదృష్టకరం..
ఉద్యమకారుడు పల్లె రవి మృతదేహానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో రవితో కలిసి పనిచేసిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రవిని కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని, ఆయన మృతి ఎంతో బాధించిందని వాపోయారు. విప్‌తో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, కాంగ్రెస్ నాయకులు సిరాజ్‌ఖాద్రీ, నాయకులు మైత్రియాదయ్య నివాళి అర్పించారు.


