● మన్యంకొండలో ఘనంగా
శ్రీకృష్ణాష్టమి వేడుకలు
● వైభవంగా శేషవాహన సేవ..
తరలివచ్చిన వేలాది భక్తులు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం అర్ధరా త్రి ఉట్ల మహోత్సవం వైభవంగా జరిగింది. ఓబ్లాయపల్లి భక్తులు పాల్గొని ఉత్సవాన్ని ముగించా రు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, అ భిషేకాలు నిర్వహించారు. శ్రావణమాసం సంద ర్భంగా ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలా ది మంది భక్తులు తరలిరావడంతో మన్యంకొండ భక్తజన సంద్రంగా మా రింది. శ్రావణమాసం సందర్భంగా ప్రతి శనివారం నిర్వహిస్తున్న శేషవాహన సేవలో భాగంగా శనివా రం రాత్రి స్వామివారిని శేషవాహనంపై కొలు వుదీర్చి మ ంటపం వరకు ఊరేగించారు. సన్నాయి వాయిద్యాలు, వేదమంత్రాల నడు మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగారు ఆభరణాలు, పూల అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహ రి మధుసూదన్‌కుమార్,ఈఓ శ్రీనివాసరాజు, పా లకమండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.


